విశ్వక్ సేన్ చేయాల్సిన ఆ సినిమా.. నాగచైతన్య చేతికి ఎలా వెళ్లింది..? తెర వెనుక ఆ నైట్ ఏం జరిగింది..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న రోల్ లో మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. కొన్ని సార్లు తమ అనుకున్న హీరో కాకుండా వేరే హీరో సెలెక్ట్ అవుతూ ఉంటారు . అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ చాలా చాలా కామన్ . అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్షియల్ అవుతున్న హీరో విశ్వక్సేన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి .

హీరో విశ్వక్సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రోమో వైరల్ గా మారింది . ఈ ప్రోమోలో ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఆయనపై కొందరు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల గురించి కూడా పరోక్షకంగా స్పందించినట్లు తెలుస్తుంది . ఈ ప్రోమోలో హీరో నాగచైతన్య చేసిన మూవీ కోసం తాను ఆడిషన్ ఇచ్చాను అని చెప్పిన న్యూస్ ని బాగా హైలైట్ చేస్తున్నారు జనాలు. విశ్వక్ సేన్.. నాగచైతన్య నటించిన జోష్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చారట .

కొత్త నటీనటులు కావాలి అంటూ అప్పట్లో ప్రకటన వచ్చిందట . సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటూ విశ్వక్ సేన్.. ఆ విధంగా ట్రై చేశారట . కానీ కొన్ని కారణాల చేత ఆడిషన్ ఇచ్చినా కూడా సెలెక్ట్ కాలేకపోయాడట . ఆ తర్వాత ఈ మూవీకి నాగచైతన్య సెలెక్ట్ అయ్యాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. నిజానికి చాలామంది నాగచైతన్య కన్నా విశ్వక్ సేన్ లో నటించే క్వాలిటీస్ ఉన్నాయి అని ..మరి ఎందుకు విశ్వక్ సేన్ ను కాకుండా నాగచైతన్యను హీరోగా తీసుకున్నారు అని ద్వంద అర్ధాలతో ట్రోల్ చేస్తున్నారు. బహుశా నాగార్జున కొడుకు కావడంతో అటువంటి బ్యాక్ గ్రౌండ్ కలిసొస్తుంది అని మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏమో..? విశ్వక్ సేన్ సాదాసీదా మనిషి కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టీంట వైరల్ గా మారింది..!!