ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయ్.. టాలీవుడ్ నెం 1 హీరోగా అన్ ఎక్స్పెక్టెడ్ పర్సన్..ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అభిమానులు కొట్టుకు చచ్చేది ఏ హీరో నెంబర్ వన్ .. ఏ హీరో తోపు అనే విషయం . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి పోల్స్ ఎక్కువగా మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు రకరకాల సెషన్స్ కండక్ట్ చేస్తూ ఈవారం ఈ నెలలో ఏ హీరో టాప్ .. ఏ హీరో ఏ స్థానం దక్కించుకున్నాడు అంటూ ర్యాంకింగ్స్ ఇస్తూ వచ్చారు . ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మ్యాక్స్ గురించి దేశవ్యాప్తంగా తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరూ కూడా బాగా ఫాలో అవుతూ ఉంటారు.

దేశంలోని అన్ని సినీ రంగాలపై ఎప్పటికప్పుడు సర్వేల నిర్వహిస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది . ఇప్పటికే చాలాసార్లు ఈ సంస్థ ఇండస్ట్రీలోని హీరోలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది . తాజాగా జనవరి 2024 నెలకు సంబంధించిన తెలుగు టాప్ హీరోల లిస్టును రిలీజ్ చేసింది . అందులో టాప్ టెన్ హీరోల పేర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . కాగా రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. అయితే సలార్ కి ముందు ఆయన నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. దీనిపై కొందరి హీరోల ఫ్యాన్స్ నెగిటివ్గా స్పందిస్తున్నారు. కాగా రెండో స్థానంలో మహేష్ బాబు నిలిచాడు . ఇటీవల గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఫ్యాన్స్ ఇది తెలుసుకొని సంతోషిస్తున్నారు. ఇక మూడవ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాలుగవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ సరిపెట్టుకున్నారు. త్వరలోనే వీలు నటించిన దేవర- పుష్ప 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

కాగా ఐదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిల్చున్నాడు. గేమ్ చేంజర్ సినిమాతో ఈయన కూడా ఈ ఏడాదిలోనే పలకరించబోతున్నాడు . కాగా ఇక ఆరవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఏడవ స్థానంలో నేచురల్ స్టార్ నాని సరిపెట్టుకున్నారు ..ఎనిమిదవ స్థానంలో రవితేజ.. 9వ స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పదవ స్థానంలో చిరంజీవి స్థానాలను కైవసం చేసుకున్నారు . అయితే దీని పట్ల కొంతమంది ఫ్యాన్స్ మండిపడుతుంటే .. మరి కొంతమంది మాత్రం ఇది జస్ట్ సర్వేనే అని .. ఎవరి ఫ్యాన్ ఎవరి హీరో ఆ అభిమానికి గొప్ప అని లైట్ గా తీసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి అని .. పాన్ ఇండియా హీరోలు సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోతే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పొజిషన్ అయినా మారిపోవచ్చు అని చెప్పుకొస్తున్నారు..!!