ఐశ్వర్యరాయ్ పై అలాంటి కామెంట్స్ చేసిన కంగనా.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు

బాలీవుడ్ ఫైబర్ బ్రాండ్ కంగ‌నకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ క్వీన్ గా ఎక్కువ పాపులర్ అయింది. వివాదాల్లో నిత్యం నిలుస్తూ ఉండే కాంగన తాను మాట్లాడాలనుకున్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే అస్సలు సంకోచించకుండా.. ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఎవరిని ఏదనాలనుకుంటే అది అనేస్తుంది. వారు ఎంతటి వారైనా.. ఎప్పటికప్పుడు తన మనసులో భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఫాన్స్ కు అందుబాటులో ఉంటూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఆమె హీరోయిన్ ఐశ్వర్య రాయి పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోతో పాటు ఆమె మాటలు కూడా వైరల్ గా మారాయి.

ఆమె హ‌మ్ దిల్‌సే చుక్‌ సనామ్‌ సాంగ్ లోని క్లిప్ ను షేర్ చేసుకుంది. ఆ పాటలో ఐశ్వర్య రాయి నటనను మెచ్చుకుంటూ.. ఐస్ ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తుంది అంటూ ప్రశంసించింది. ఎప్పుడు కంగనా.. ఐశ్వర్య రాయ్‌పై చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారింది. గతంలో కూడా కంగన ఐశ్వర్య పై ఇలాంటి కామెంట్స్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్యన ఎలాంటి బంధం ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. చందమామ ఎలా అయితే ఎప్పటికీ మారదో అలానే ఐష్ కూడా ఎప్పుడు ఒకేలా ఉంటుంది అంటూ కంగనా వివరించింది. అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆడవారి వయసును ఉద్దేశిస్తూ అందులో ఐశ్వర్య రాయిపై ఆమె చేసిన కామెంట్స్ సంచలనాన్ని సృష్టించాయి. 45,50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారి అందాన్ని ఎవరు పట్టించుకోరు.. సాంగ్ రైటర్స్ కేవలం యువతుల అందాలను గురించి మాత్రమే పోల్చి పాటలు రాస్తూ ఉంటారు.

50 ఏళ్లు వచ్చిన తర్వాత ఆడవారు ఎంత అందంగా ఉంటారో చెప్పడం లేదు అంటూ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా పోనియన్ సెల్వ‌న్ సినిమాను ఉదాహరణగా చూపించిన కంగనా.. ఈ మూవీ నుంచి ఐశ్వర్య రాయి సిక్‌ ఒకటి షేర్ చేసింది. ఆ వీడియోలో ఐశ్వర్యరాయ్ చాలా అందంగా అసలు ప్రేక్షకులు చూపు తిప్పుకోలేని విధంగా కనిపించింది. ఈ సినిమాలో మణిరత్నం హీరో కంటే హీరోయిన్స్ పాత్రలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులో ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యాన్స్ అయింది కూడా కుంతవైగా నటించిన త్రిషకు, నందినీగ నటించిన ఐశ్వర్యారాయ్ కి ఈ ఇద్దరికీ సమానంగా గుర్తింపు దక్కింది అంటూ కంగనా కామెంట్స్ చేసింది. అయితే ఎప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ మాత్రమే చేసే కంగనా ఇలా సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యను ప్రశంసించడంతో అందరూ షాక్ అవుతున్నారు.