కొడుకు పెళ్లిలో రెచ్చిపోయిన దిల్ రాజు.. వయసు మర్చిపోయి ఏం చేశాడో చూడండి..!!

దిల్ రాజు .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి డిస్టర్బ్యూటర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి .. ఏ సినిమా ఎప్పుడు ఓటీడీలోకి రావాలి అని చెప్పే రేంజ్ కి ఎదిగిపోయాడు దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు . కాగా స్టార్ట్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశీష్ రెడ్డి పెళ్లిలో సందడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిల్ రాజు వారసుడిగా ఆశీష్ రెడ్డి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు . హీరోగా పర్లేదు అనే టాక్ దక్కించుకున్నాడు. అయితే రీసెంట్గా యంగ్ హీరో ఆశిష్ రెడ్డి – అద్వైతా రెడ్డి ని జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు . బంధువులు సన్నిహితుల సమక్షంలో ఆశిష్ – అద్వైతా రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు . ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు . చిరంజీవి కూతుర్లు శ్రీజా – సుస్మిత కూడా ఈ వేడుకకు హాజరు అవ్వడం గమనార్హం.

ఈ పెళ్లిలో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దిల్ రాజు తన వయసును కూడా మర్చిపోయి చిన్నపిల్లడిలా చిందులు వేశాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు పెళ్లిలో డప్పు కొడుతూ డాన్స్ వేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటివరకు మనం దిల్ రాజు ఎప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ లో చూసి ఉండడం. ఎప్పుడూ కూడా రిజర్వాడ్ గా ఉండే దిల్ రాజు తన తమ్ముడు కొడుకు పెళ్లిలో ఈ రేంజ్ లో హంగామా చేయడంతో ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు. ఓ రేంజ్ లో ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు..!