గూడచారి 2 లో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్.. రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన మూవీ గూడచారి. ఈ సినిమా హిట్ తర్వాత ఆయన కెరీర్ మరింత ఉపందుకుంది. ప్రస్తుతం అడవి శేష్‌ వరస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకు భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందించిన గూఢాచారీ సినిమా సీక్వెల్ జీ 2 ను తెర‌కెక్కిస్తున్నాడు అడవి శేష్‌. ఈ సినిమాకు స్వయంగా తనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ మూవీ హిందీలో కూడా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు ప్రధాన విలన్ గా బాలీవుడ్‌ యాక్టర్ ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Emraan Hashmi joins Adivi Sesh-starrer Goodachari 2 | Telugu News - The  Indian Express

అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాగా విన్యాకుమార్ డైరెక్టర్గా ఏంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమాకు భబిత సంధూ హీరోయిన్గా నటించనుంది. అడవి శేష్‌ ప్రఖ్యాతిగాంచిన.. గూడచారి సినిమా సీక్వెల్ గా జీ2 సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇమ్రాన్ హష్మీ తన అఫీషియల్ ఎక్స్ ప్రెజ్‌ లో జీ2 సినిమాకు తన నటీనటుల ప్రకటనను షేర్ చేసుకున్నాడు.

Goodachari 2: Banita Sandhu comes on board for Adivi Sesh's spy thriller

అతిపెద్ద గూడచారి ఫ్రాన్చైజ్‌కి బ్లాక్ బస్టర్ జోడింపు దక్కింది. బోర్డింగ్ మిషన్ హాస్టల్ జీ2 షూట్ ప్రోగ్రెస్ లో ఉంది అంటూ ఆయన క్యాప్షన్ తో ఈ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని అడవి శేష్‌ కూడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పేజీలో ప్రకటించాడు. అద్భుతమైన నటుడు ఇమ్రాన్ హాస్మిన్ # జీ2.. విశ్వంలోకి స్వాగతిస్తున్న.. సార్ మీతో పని పనిచేయడానికి అసలు వేచి ఉండలేకపోతున్నా అంటూ షేర్ చేసుకున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాకి ఏకంగా రూ.7 కోట్ల రమ్యునరేష్ తీసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో ఇతనికి ఓ ప్రత్యేక పాత్ర ఉందని.. ఆ పాత్ర చాలా పెద్దది కావడంతో ఆ రెమ్యూనరేషన్ విలువైనదిగా మేకర్స్ భావిస్తున్నారట.