ప్రభాసే కాదు ..ఆ దేవుడే దిగ్గి వచ్చిన ..ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది..ఎవ్వడు ఆపలేడు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది చాలా చాలా విపరీతంగా పెరిగిపోయింది . పాజిటివిటీ కన్నా నెగిటివ్ గానే ఎక్కువగా జనాలు కామెంట్స్ చేయడం ప్రారంభించారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కన్నప్ప సినిమా పై ఎలాంటి నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాగా రీసెంట్ గా కన్నప్ప సినిమాకి సంబంధించి ఒక దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది .

కొందరు ఆకతాయిలు కన్నప్ప సినిమా ఫ్లాప్ అవుతుంది అని ముందుగానే రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టిన సరే ఆ సినిమా హిట్ అవ్వదు అని ముందుగానే ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు . గత కొంతకాలంగా ఇలాంటి వార్తలు వింటున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . కొందరైతే ఏకంగా ఆ దేవుడే దిగివచ్చినా కూడా ఈ సినిమా ప్లాప్ అవుతుంది అంటూ దారుణాతి దారుణంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో కెమియో రోల్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ.. దానికి తలా తోకాలేని లాజిక్ కూడా ముడి పెడుతున్నారు. రీసెంట్ గా లాల్ సల్లామ్ సినిమాలో రజనీకాంత్ ను ఉదాహరణ గా చెప్పుతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ మొహమాటం కొద్ది ఈ సినిమా కి ఒప్పుకున్నాడు అంటూ వార్తలను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!!