చెత్త కుప్పలో దొరికిన ఈ అమ్మాయి ..ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చెత్తకుప్పలో దొరికిన ఆ అమ్మాయిని ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మనం తెరపై చూస్తున్నామా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లో మిథున్ చక్రవర్తి కూడా ఒకరు . ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . హిందీ ఇతర భాషలలో కలిపి మొత్తంగా 350కు పైగా చిత్రాలలో నటించి మెప్పించాడు .

మిధున్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే . యోగితా బాలిని పెళ్లి చేసుకొని ముగ్గురు కుమారులు కు జన్మనిచ్చారు . అయితే మొదటి నుంచి చాలా సాఫ్ట్ మైండ్ కల మిథున్ చక్రవర్తి ఓ రోజు బెంగాలీ వార్త పత్రికలో ఒక వార్త చదివి హృదయంతో చలించిపోయాడు. కోల్కతాలోని ఒక చెత్త కుప్పలో పసికందును పారేశారు అని ఆ వార్త సారాంశం. అయితే అది చదివి అందరిలాగా అయ్యో పాపం అంటూ వదిలేయకుండా మిథున్ ఆ బాలిక దీనస్థితిని చూసి జాలిపడి దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు . అతని భార్య కుమారులు కూడా ఆ పసికందున కుటుంబంలోకి హ్యాపీగా వెల్కమ్ చేశారు.

అలా దత్తత తీసుకున్న ఆ పుత్రికే ఈ దిశాని చక్రవర్తి . ఇప్పుడు హాలీవుడ్లో ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది. దిశాని పెంపుడు తల్లితండ్రులు సోదరుల ఆప్యాయతలతో ప్రేమతో చాలా గారాబంగా పెరిగింది. చీమకుట్టకుండా చాలా జాగ్రత్తగా పెంచుకున్న మిధున్ చక్రవర్తి ..ఇప్పుడు ఆమె ఆ పొజిషన్లో ఉండడానికి కారణం అంటూ పలువురు ఆయన ను అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి నటనలో పట్టభద్రురాలు అయింది దిశాని చక్రవర్తి..!!