సొరకాయని తినడం వల్ల ఇన్ని లాభాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

పొడ‌వుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే సొరకాయలు రెండు ఒకే గుణాన్ని కలిగి ఉంటాయి. కొందరు సొరకాయని అస్సలు తినరు.. మరికొందరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అయితే సొరకాయని తినని వారు సొరకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే తప్పకుండా తింటారు. సొరకాయ శరీరానికి చల్లదాన్ని అందిస్తుంది.

Growth More Enterprises Bottle Gourd Seeds, Sorakaya Seeds Seed Price in  India - Buy Growth More Enterprises Bottle Gourd Seeds, Sorakaya Seeds Seed  online at Flipkart.com

అలాగే ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్రలేమి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే మూత్రనాళ జబ్బులకు, మలబద్ధకం, కాలేయ సమస్యలు ఉన్నవారికి సొరకాయ చాలా బాగా పనిచేస్తుంది.

Bottle Gourd Seeds | Sorakaya Seeds Online

అలాగే గుండె జబ్బులను తగ్గించడంలో కూడా సొరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సొరకాయ కూరకి శొంఠి పొడిని గాని, మిరియాల పొడిని గాని కలిపి తీసుకోవడం ద్వారా జలుబు సమస్య కూడా తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సొరకాయని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. సొరకాయని కనీసం వారానికి మూడుసార్లు తినండి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి.