500 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ ” సలార్ ” మూవీ… సంతోషంతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.

ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కి పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగింది. దీంతో ప్రభాస్ మరో మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమాకి రేపటి నుంచి టికెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం సలార్ మూవీ కూడా 500 కోట్ల క్లబ్లో చేరడంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తపై అభిమానులు స్పందిస్తూ…” ప్రభాస్ ఈ ఒక్క సినిమానే కాదు ప్రతి ఒక్క సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరాల్సిందే. జస్ట్ ఇది ఎంట్రీ మాత్రమే.. అసలైన మజా ముందు ముందు ఉంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.