విజయ్ కాంత్ మృతితో తీవ్ర నిర్ణయం తీసుకున్న చిత్ర పరిశ్రమ..!

తమిళ్ సూపర్ స్టార్, డీఎండీకే పార్టీ చీఫ్ విజయ్ కాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన నేడు ఉదయం కన్నుమూశారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈయన అనంతరం సినిమాలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు.

ఇక తాజాగా.. ఈయనకు దగ్గు, జ్వరం, జ్వల్బు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు వీరి కుటుంబం. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈయన ఇవ్వాళ ఉదయం కన్నుమూశారు. అయితే 27 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టినటువంటి ఈయన దాదాపు 150కి పైగా సినిమాలలో నటించారు. 100 సినిమాల్లో హీరోగా చేశారు.

ఇక దాదాపు 20 కి పైగా సినిమాలలో పోలీస్ పాత్రలలో నటించారు. ఇక ఈయన మరణించడంతో సినీ పరిశ్రమ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ జరుగుతున్న సినిమా షూటింగ్స్ ను నిలిపి వేయడంతో పాటు థియేటర్లలో ఆడుతున్న సినిమాలను రద్దు చేయాలని సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుందట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.