‘ డెవిల్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ట్విస్ట్‌లు అదిరిపోయాయి.. ఆ ఒక్కటే మైనస్..

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ – సంయుక్తమైన జంటగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామా డెవిల్. ఇందులో కళ్యాణ్ రామ్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు అభిషేక్ నామ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ముగిసాయి. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైం మూవీలో ఏజెంట్ రోల్‌ ప్లే చేశాడు. ఇది పిరియాడికల్ ఫిక్షనల్ మూవీ. బ్రిటిష్ ప్రభుత్వం కోసం ఏజెంట్‌గా పని చేసే ఇండియన్‌గా కళ్యాణ్ రామ్ నటించాడు.

NKR's 'Devil' To Thrill Us At The End Of 2023 | NKR's 'Devil' To Thrill Us  At The End Of 2023

ప్రభుత్వ ఆదేశాల మేరకు డెవిల్.. ఓ యువతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి.. కిల్లర్ ఎవరని అని తెలుసుకునే టైం లో షాకింగ్ విషయాలు ఎన్నో బయటపడతాయి.. సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల సినిమా పై అంచ‌నాలు పెరిగాయి. డెవిల్ పై గట్టి నమ్మకంతో కళ్యాణ్‌రామ్ సీరియస్‌గా ప్రమోషన్స్ జరిపాడు. ఇంటర్వ్యూలో సందడి చేశాడు. డెవిల్ ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చింది. ఇక సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి చూద్దాం.

స్టోరీ చాలా బాగుంది. అయితే అవసరం లేని కొన్ని కమర్షియల్ అంశాలు ఇందులో కలపడం వల్ల సినిమా ల్యాగ్‌ అనిపించింది. నరేషన్ ఫ్లాట్ గా ఉంది. ఇక ఇంటర్వెల్ కి ముందు నుంచి సినిమా రసవత్రాంగా సాగింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటూ నెటిజ‌న్ వివరించాడు. మరో నెటిజన్ సినిమా ప్రారంభం బాగుంది. మెల్లగా ఫామ్‌లోకి వ‌చ్చింది. ఇంటర్వెల్ బ్యాక్ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ యావ‌రేజ్. సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగా అనిపించింది.

Makers of Devil extend Dussehra wishes with a special poster | 123telugu.com

మొత్తంగా ఈ సినిమా చూడదగ్గ సినిమా అంటూ ఎక్స్ వేదికపై రాసుకోచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది అంటూ కళ్యాణ్ రామ్‌కి సినిమాతో కచ్చితంగా హిట్ అయితే పడుతుంది అని ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరొక ఆడియన్ గుడ్ బాగుంది ఓసారి చూడొచ్చు అంటూ.. సెకండ్ హాఫ్ లో వచ్చి ఆర్టిస్టులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, క్లైమాక్స్ రొటీన్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ట్విట్టర్ రివ్యూల ప్రకారం మెజారిటీ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండ్ హాఫ్ నుంచి సినిమా బాగుందని అర్థమవుతుంది. కథలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను అలరిస్తాయట. మొత్తంగా సినిమా చూడదగ్గ సినిమా అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.