” బబుల్ గమ్ ” మూవీ రివ్యూ… సుమ కొడుకు హిట్టా..? ఫ్లాపా…?

క్షణం, కృష్ణ, హిజ్ లీల వంటి డీసెంట్ సక్సెస్ లతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు రవికాంత్ పేరేపు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు సుమా కొడుకు రోషన్ కనకాలతో ” బబుల్ గమ్ ” అనే సినిమాని రూపొందించి నేడు రిలీజ్ చేశాడు. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ” సంస్థతో కలిసి ” మహేశ్వరి మూవీస్ ” సంస్థ నిర్మించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.

కానీ ఈ సినిమాకి పోటీగా.. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించినటువంటి ” డెవిల్ ” మూవీ రిలీజ్ అయింది. అలాగే ప్రభాస్ ” సలార్ ” కూడా థియేటర్ల వద్ద సూపర్ ఫామ్ లో ఉంది. ఇక ఈ క్రమంలో బబుల్ గమ్ ఎంత మేరా ముందుకు వెళుతుంది అనేది అందరిలో ఆసక్తిగా మారింది. కానీ ఈ సినిమా దర్శకుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సలార్ సినిమాలు లేనివి మా సినిమాలో ఉన్నాయి అంటూ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.‌..”బబుల్ గమ్ ” సినిమాకి చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.

కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి అయితే ఆల్రెడీ స్పెషల్ షోలు వేయడం జరిగింది. వాళ్లు ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కూడా. ఫస్ట్ హాఫ్ ఫన్నీ ఫన్నీ గా బాగానే అనిపిస్తుందట. కానీ సెకండ్ హాఫ్ మళ్లీ కృష్ణ అండ్ హిజ్ లీల టైప్లో ఉంటుందట. అది ఆడియన్స్ కి రిపీట్ గా అనిపించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఈ మూవీ యూత్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మితిమీరిన లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్లు ఉండడం కొంత మైనస్ అని.. వాటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పక్కన పెట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏ విధమైన టాక్ ని అందుకుంటుందో చూడాలి మరి.