నటుడు విజయ్ కాంత్ నిన్న మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన ఒక్క తమిళ్లోనే కాకుండా తెలుగు భాషలో సైతం ఆదరణ పొందారు. ఈయన నటించిన కొన్ని డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ ని షేక్ చేశాయి కూడా. 80వ దశకంలో నటుడుగా అరంగేట్రం చేసిన విజయ్ కాంత్ కెరీర్ బిగినింగ్లో విలన్ రోల్స్ చేశారు. అనంతరం హీరోగా మారి అతిపెద్ద స్టార్ గా ఎదిగారు. విజయ్ కాంత్ సినిమాలకు తెలుగులో సైతం మార్కెట్ ఉండేది. ఈయన డబ్బింగ్ సినిమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వసూళ్ల వర్షం కురిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. కెప్టెన్ ప్రభాకర్:
తమిళ్ లో విడుదలైంది ఈ మూవీ. ఇక అనంతరం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈయనకి అత్యంత పాపులారిటీని తెచ్చిపెట్టింది.
2. నూరవ రోజు :
హర్రర్ సినిమాగా తరికెక్కిన ఈ మూవీ విజయ్ కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 1984లో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
3. క్షత్రియుడు:
తెలుగులో మంచి విజయం సాధించిన విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమాలలో క్షత్రియుడు ఒకటి. భానుప్రియ, రేవతి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
ఇలా ఈ మూడు సినిమాలే కాకుండా అనేక సినిమాలతో భారీ కలెక్షన్స్ను రాబట్టాడు విజయ్ కాంత్. ఇక ప్రస్తుతం ఈయన మన మధ్య లేకపోవడం బాధాకరం.