బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ ట్విస్ట్.. ఇకపై నుంచి అది క్యాన్సిల్..

బిగ్‌బాస్ రియాలిటీ షోకు విపరీతమైన పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అదే టైంలో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా ఈ షో మారుతుంది. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు ఫ్యాన్స్ విషయంలో జోరుగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై బిగ్ బాస్ నిర్వహణలో చాలా మార్పులు జరగనున్నాయట. బిగ్‌బాస్ సీజన్ 7 భారీ సక్సెస్.. అద్భుతమైన టిఆర్పి వచ్చిన మేకర్స్ ఆ ఆనందాన్ని ఆస్వాదించక ముందే వివాదాలు చుట్టుముట్టాయి. షో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అదే స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.

Suo moto cases against BB Telugu 7 winner Pallavi Prashanth and fans -  Hindustan Times

టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టుతో ఈ షో రేపిటిషన్ కూడా దెబ్బతింది. బిగ్‌బాస్ ను ఇకపై ఆపేయాలన్న వాదనలు కూడా వినిపించాయి. పోలీసులు కండిషన్స్ కూడా లెక్కచేయకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీలో హాజరై మరింత గొడవకు కారణమయ్యాడని అతడికి కోర్ట్ రిమాండ్ విధించింది. తర్వాత బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ అయితే ఇతర కంటెంట్ల కార్లపై దాడి చేసి ఎన్నో అల్లర్లకు దారి తీశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇంకొంతమంది నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తిస్తున్నారు. ఇంకా చాలామంది అరెస్టు అయ్యే అవకాశం కూడా ఉందట. ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని.. కంటెంట్ గా ఎంపికైన వారితో అగ్రిమెంట్ చేయించుకోబోతున్నారట. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, విన్నర్, ఫైనలిస్ట్ ఎవరు ర్యాలీలు నిర్వహించకూడదు. అభిమానులను అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కాలవనే కూడదు అని కండిషన్ పెట్టాలని భావిస్తున్నారట.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Arrested

ఇక దీన్ని బట్టి నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు ర్యాలీతో ఫ్యాన్స్ కు దగ్గర అయ్యే అవకాశం ఉండదు. నేరుగా ఇంటికి వెళ్లి పోయాలా బిగ్ బాస్ ఒప్పందం కుదుర్చుకుపోతున్నారు. ఇక పోలీసులు కూడా ఇదే సూచనలు బిగ్ బాస్ యాజమాన్యానికి చెప్పాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇలాంటి గొడవలు కూడా ఏవి జరగకుండా ఉండాలంటే అదే కరెక్ట్ డెసిషన్ అని.. నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోడ్ల మీద ర్యాలీ చేయడం కుదరదని తెలుస్తోంది. ఇది నిజంగానే బిగ్ బాస్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్. అయితే నిజంగా ర్యాలీలో మీద నిషేధం విధించారా.. కంటెస్టెంట్స్ అభిమానులను కలవాలంటే కచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందేనా తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.