క్రిస్మస్ రోజు సలారోడి జోరు.. ఎన్ని కోట్లు కొట్టాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరో నుంచి స్టార్ రేంజ్‌కు త‌మ స్టేజ్ ను పెంచుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రమే టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి తెలిసేలా చేశారు. అలాంటి లిస్టులో మొదట రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అంతలా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్. ఈ ఊపులోనే ఇప్పుడు సలార్‌ సీజ్ ఫైర్ అనే మూవీతో స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు.

ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే భారీ సక్సెస్ అందుకొని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులు అవుతుంది. ఈ నాలుగు రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లతో దూసుకుపోతున్న సలార్‌ బిజినెస్ లెక్కలు ఓసారి చూద్దాం. మొదటిరోజు రూ.175 కోట్లను కలెక్ట్ చేసిన సలార్ రెండవ రోజు రూ.120 కోట్లు కొల్లగొట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం సలార్ కలెక్షన్స్ కలిపి రూ.402 కోట్లు వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇక నిన్న క్రిస్మస్ హాలిడే కావడంతో నాలుగో రోజు కూడా సలార్ కలెక్షన్స్ లో ప్రభాస్ స్టామినా రుజువైంది. దాదాపు 505 కోట్ల వరకు గ్రాస్ పశువులను కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.500 కోట్లు అంటే అది సాధారణమైన విషయం కాదు. దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ ర్యాంపేజ్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. నాలుగో రోజు పూర్తిగా ఎన్ని కోట్లు వచ్చాయో అనే అంశం మరి కొంతసేపట్లో తెలుస్తుంది