ప్రభాస్ ” సలార్ పార్ట్ 2 ” లో ఆ అంచనాలు మరింత భారీగా రూపొందించిన ప్రశాంత్ నీల్… ఏది ఏమైనా నువ్వు కేక బాసు…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంత పెద్ద విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో ఊచ కోత కోస్తుంది.

ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్.. ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియ రెడ్డి, బాబీ సింహా కీలక పాత్రలు వహించిన ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్, బిజిఎం అందించాడు.

ఇక అసలు విషయం ఏమిటంటే సలార్ పార్ట్ 1 నీ మించేలా పార్క్ 2 ఉంటుందని సమాచారం. సెకండ్ పార్ట్ లో మాస్ యాక్షన్ డైలాగులతో పాటు వారి ఎమోషన్ కూడా ఉండబోతుందట. అలానే మెయిన్ స్టోరీ కీలక పాత్రదారుల నడుమ సాగుతుందని లేటెస్ట్ టాక్. ఇక ఈ మూవీ పార్ట్ 1 కి పదిరెట్లు ఎక్కువగా పార్ట్ 2 ఉండబోతుందట. ఇక పార్ట్ 2 ఆడియన్స్ ని ఇంకే రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.