“ఇక నోర్లు మూస్తారా బ్రదర్స్”.. మెగా కౌంటర్ అంటే ఇదే.. పోలా అద్దిరిపోలా..!!

ప్రతి పని పాట లేని వాడికి మెగా ఫ్యామిలీ పైనే కన్ను . మెగా ఫ్యామిలీని ఎలా ట్రోల్ చేయాలి..? ఎలా డీ గ్రేడ్ చేయాలి? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను ఎలా నెట్టింట వైరల్ చేయాలి ..ఇదే పనిగా పెట్టుకుని ఉన్నారు కొందరు యాంటీ మెగా ఫాన్స్. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు పొద్దికి పదిసార్లు అయినా మెగా ఫ్యామిలీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

అవసరం ఉన్న అవసరం లేకపోయినా మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసే యాంటీ మెగా ఫాన్స్ మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటారు . రీసెంట్గా అలాంటి వాళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ . ప్రతి పండుగని మెగా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా కలిసి చేసుకుంటుంది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఫంక్షన్ ని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది . ప్రతి సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది .

ఈసారి కూడా మెగా ఫ్యామిలీ ధూమ్ ధామ్ అంటూ మేరీ క్రిస్మస్ అంటూ బాగా సెలబ్రేట్ చేసుకుంది . దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ జరిగిన బన్ని లేదా చరణ్ ఎవరో ఒకరు ఫోటోలో మిస్ అవుతూ ఉంటారు . అయితే ఈసారి మాత్రం ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మెగా ఫ్యామిలీ ఫోటో నిండుగా కనిపించింది. యంగ్ జనరేషన్ అంతా ఒక్కచోట సందడి చేశారు . దీంతో మెగా ఫాన్స్ ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు ఇకనైనా నోర్లు మూస్తారా బ్రదర్స్ .. ఎవరైతే బన్నీ చరణ్ ల మధ్య గొడవలు ఉన్నాయి అని అంటున్నారో వాళ్లకి ఈ ఫోటో అంకితం అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఏమాటకామాటే మెగా కౌంటర్ మాత్రం అద్దిరిపోయింది అని చెప్పాలి..!!