బ్లాక్ బస్టర్ సినిమాకి .. 10 రుపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఇతడే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు ప్రతి ఒక్కరు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . హీరోయిన్లు కూడా 8 – 9 – 10 కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు . నిన్నకాకమున్న ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీ లీల ఒక్క సినిమాకి ఏకంగా ఐదు కోట్లు ఛార్జ్ చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

అయితే స్టార్ హీరో మాత్రం తన సినిమాకు కేవలం 10 రూపాయల రెమ్యూనరేషన్ గా తీసుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ . రవితేజ కెరియర్ ఎలా ప్రారంభమైందో మనందరికీ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత కమెడియన్గా ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత స్టార్ హీరోగా ఇప్పుడు మాస్ మహారాజా గా మనం ముందున్నాడు.

అయితే కెరియర్ స్టార్టింగ్ లో రవితేజ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినందుకు కేవలం పది రూపాయల రెమ్యూనరేషన్ గానే తీసుకునే వారట. అప్పట్లో ఆయన ఖర్చులకు ఆ పది రూపాయలు చాలా చాలా హెల్ప్ చేశాయట , ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రవితేజ. ప్రజెంట్ రవి తేజ ఒక్కో సినిమా 50-60 కోట్లు తీసుకుంటున్నాడు..!!