తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మాళవికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా బాగుంది అనే సినిమా ద్వారా పరిచయమైన ఈమె ఈ తరం ప్రేక్షకులను కూడా బుల్లితెర పైన చూస్తూనే ఉన్నారు. తన విలక్షణమైన నటనతో మంచి ఇమేజను సంపాదించుకుంది మాళవిక.. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లో అన్ని భాషలలో కూడా నటించి మెప్పించింది..1999లో సినీ రంగ ప్రవేశం చేసిన మాళవిక ఎప్పుడు కూడా వివాదాస్పదమైన నటిగా పేరుపొందింది.
దీంతో మాళవికాకు ఆఫర్లు తగ్గిపోయాయి. 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈమెను గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయింది. ఆ మధ్య ఒక తెలుగు టాప్ షో కి గెస్ట్ గా వచ్చినప్పుడు చాలామంది ఈమెను గుర్తుపట్టలేకపోయారు.అంత బరువు పెరిగిన మాళవిక ఇప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జిమ్ వర్కౌట్లు చేయడంతో డైట్ ను మైంటైన్ చేయడం వల్ల మాళవిక మళ్ళీ సన్నగా నాజుగ్గా మారిపోయింది.
ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం రీయంట్రి ఇవ్వడానికి మాళవిక సిద్ధమైపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ టీవీ చానల్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తున్న ఈమె త్వరలోనే వెండితెర పైన కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్స్ సైతం పలు రకాల క్యారెట్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. చాలామంది హీరోయిన్లతో సమానంగా సంపాదిస్తున్నారు. మరి మాళవిక గట్టిగా ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా ఈమెకు అవకాశాలు వెలుపడతాయని పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram