బిగ్ బాస్ 7 : 9 వారాలకు తేజ ఎంత రెమ్యూనిరేషన్ పుచ్చుకున్నాడో తెలుసా.. అమ్మ బాబోయ్ ఏకంగా అంతనా..!!

టేస్టీ తేజ.. ఈ పేరుకు తగ్గట్టే ఈయన ఒక భోజన ప్రియుడు. కాదు కాదు.. భోజన ప్రియుడు కాబట్టే ఈ పేరు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోనూ తన పేరుకు న్యాయం చేస్తూ.. గుడ్లు దొంగతనం, స్వీట్ల కోసం కక్కుర్తి పడేవాడు. ఈ ఉత్సాహం ఆటలో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్ళు ఉండేవాడు. కానీ పెద్దగా ఆటలు ఆడక పోవడంతో తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అయిపోయాడు.

గొప్పగా ఆడకపోవచ్చు కానీ.. జనాలకి ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్క ఇచ్చాడు. అందరితోనూ కలుపుగోలు తనంతో ఉంటూ అందరి మనసులు దోచుకున్నాడు. ప్రతి వారం ఈయన ఒకరిని నామినేట్ చేయడం.. వాళ్లు నెక్స్ట్ వీకే వెళ్లిపోవడం లాంటివి జరిగాయి. ఇప్పుడేమో ఏకంగా తేజనే ఎలిమినేట్ అయిపోయాడు. 9 వారాలు హౌస్ లో ఉన్న ఈయనకి బాగానే డబ్బు అందింది. వారానికి దాదాపు రూ.1.75 లక్షల మేర తీసుకునేవాడు. ఈ లెక్కన 9 వారాలకు చూసుకుంటే రూ.15 లక్షలకు పైగానే వెనకేసుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి కట్టింది 8 లక్షలైతే… బిగ్బాస్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి 15 లక్షలు చేసుకున్నాడు. అంటే 7 లక్షలు బిగ్ బాస్ దగ్గర నుంచి లాక్కున్నాడన్నమాట. ఈయన రెమ్యునరేషన్ తెలుసుకున్న ప్రేక్షకులు…” హౌస్ లో ఏమి ఆడకపోయినా బాగానే సంపాదించుకున్నాడు. కడుపుబ్బ నవ్విస్తూ అందరిని ఎంటర్టైన్ చేశాడు. ఎప్పుడు ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.