“హాయ్ నాన్నలో మీకు ఓ బిగ్ సర్ ప్రైజ్”.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని రివీల్ చేసిన మృణాల్ ఠాకూర్..!!

నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తాజాగా నటిస్తున్న మూవీ ” హాయ్ నాన్న “. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీకి.. శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమానే హాయ్ నాన్న. ఈ సినిమా ప్రమోషన్స్‌ సర్వేగంగా సాగుతున్నాయి.

హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో మృణాల్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ… నాని పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ” నాని నాచురల్ యాక్టర్. నేను నా పాత్రలో నటించడానికి నాని చాలా సహాయం చేశాడు. హాయ్ నాన్న సినిమాలో నా పాత్ర నా కెరీర్ లోనే అద్భుతమైన రోల్. ఇందులో లవ్ అండ్ డీప్ ఎమోషన్స్ ఉన్నాయి.

నటిగా నేనేం చేయగలనో నా పాత్ర తెలియజేసింది. ఈ సినిమాలో బేబీ కియారా కూడా అద్భుతంగా యాక్టింగ్ చేసింది. అలాగే నాని, కియారాతో చాలా ఎమోషనల్ గా ఉన్నాడంటూ” మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…. ” మీ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మీ సినిమాలో ఉన్న ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ తో మీ సినిమా హిట్ అవుతుంది…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.