మెగాస్టార్ కాళ్ళ మీద పడిన స్టార్ హీరోయిన్… వైరల్ అవుతున్న ఫోటోలు…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుని.. నవంబర్ 1న మూడు ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. ఇక వీరి వివాహం అనంతరం హైదరాబాద్ కి చేరుకున్నారు. వీరి రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాదులో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు పలు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం హాజరయ్యారు. వీరి రిసెప్షన్ కోసం కన్వెన్షన్ లోని హాలును రకరకాల డిజైన్స్ , పువ్వులు, లైటింగ్లతో డెకరేట్ చేశారు. ఈ వేడుకలో లావణ్య త్రిపాఠి మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు…” లేటుగా షేర్ చేసిన.. బెస్ట్ ఫోటో షేర్ చేశారు. మెగాస్టార్ కాళ్లు మొక్కడం చాలా బాగుంది. ఆయన రేంజ్ అలాంటిది. ఏదేమైనా ఈ కొత్త జంట సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.