విచిత్రను వేధించింది బాలయ్య కాదా ? …అనవసరంగా అపార్ధం చేసుకున్నారే!

ఒకప్పుడు తెలుగు, తమిళ , కన్నడ భాషలలో అనేక చిత్రాలలో నటించిన నటి విచిత్ర ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. ఐతే ఈ కార్యక్రమంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాను బాలకృష్ణ తో కలిసి భలేవాడివి బాసు చిత్రంలో నటించినప్పుడు, అతను తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇష్టమైన చోట చేతులు వేసేవాడని, షూటింగ్ ఐపోయాక రూంలోకి రమ్మని బలవంతం చేసేవాడని అన్నారు. విచిత్ర చెప్పిన ఈ మాటలను అనువుగా తీసుకొని, బాలకృష్ణ పై దాడికి దిగారు మన వైసీపీ నాయకులు. బాలయ్య క్యారెక్టర్ మంచిది కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

గతంలో సావిత్రి చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమంలో బాలయ్య స్త్రీల పట్ల, హీరోయిన్ల పట్ల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు టీడీపీ ఎమ్ ఎల్ ఏ గా ఉన్న బాలకృష్ణ పై బురద జల్లడం మొదలుపెట్టారు. భలేవాడివి బాసు చిత్రం తరువాత తాను సినిమాలు చెయ్యడం మానేసానని, ఇండస్ట్రీ లో అందరు అలాగే ఉంటారేమో అని భయం వేసిందని అన్నారు విచిత్ర. ఐతే వైసీపీ నాయకుల దాడికి ప్రతిదాడిగా రంగంలోకి దిగారు టీడీపీ నాయకులు. బాలయ్యకు అండగా నిలిచి, విచిత్ర చెప్పినవన్నీ అబద్దాలే అని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విచిత్రను వేధించింది బాలయ్య కాదని, 2001 ఆమె భలేవాడివి బాసు చిత్రంలో నటించినప్పుడు ఆమెను వేధించింది ఆ చిత్రం స్టంట్ మాస్టర్ విజయ్ అని, అందుకే ఆమె అతనిపై 2012 లో కేసు కూడా పెట్టిందని వాదన మొదలుపెట్టారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ వారు బయటపెట్టిన సాక్ష్యాలు చూస్తుంటే బాలయ్య నిరపరాధి అనే అనిపిస్తుంది.

ఈ విషయంలో బాలయ్యను పక్కన పెడితే, ఈ సంఘటన జరిగి ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తోంది. ఈ సంఘటన లాగానే, బయటపడని సంఘటనలు ఇంకెన్ని ఉండి ఉంటాయో అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. సినీ పరిశ్రమలో మహిళలు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం మనందరికీ తెలిసినదే.