నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ దూతకు ఎంత తీసుకున్నారంటే..?

టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల కాలంలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. గతంలో డైరెక్టర్ కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ను కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే ఓటీటి ప్రపంచంలోకి కూడా నాగచైతన్య అడుగు పెట్టాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఈ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.

దూత ట్రైలర్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. చాలా ఉత్కంఠ బరిచే విధంగా త్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు కూడా హైలైట్ గా ట్రైలర్లో కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేస్తూ ఉన్నారు అయితే ఇందులో అద్భుతంగా నటించినా నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ కోసం ఎంత తీసుకున్నాడు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

పలు రకాల నివేదికలు తెలుపుతున్న ప్రకారం దూత వెబ్ సిరీస్ కోసం నాగచైతన్య 8 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించిన నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ట్రైలర్ తోనే దూత వెబ్ సిరీస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే డిసెంబర్ ఒకటి వరకు ఆగాల్సిందే..