Unstopable with NBK: యానిమల్ టీం ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్..

నందమూరి నట‌సింహం బాల‌య్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీషో ఆన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె లిమిటెడ్ ఎడిషన్. ఇక ఈ షోకు ఇటీవల యానిమల్ మూవీ టీం హాజరైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వీడియోలో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల దీన్ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ ఎపిసోడ్ కు రాని విధంగా 25 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో కొనసాగుతుంది.

ఇక అనిమల్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఎపిసోడ్లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు. ఈ మూవీకి.. వాళ్ళ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా బాలయ్యతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ మంచిగా ట్రెండ్ అవుతుంది. ఇక యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానంది.

తండ్రి కొడుకులు మధ్యలో శృతి మించిన ప్రేమ, తండ్రి కోసం కొడుకు ఎటువంటి పని చేశాడు.. అనే అంశంపై సినిమాలో చూపించార‌ని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. అదేవిధంగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎప్పుడప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.