‘ యానిమల్ ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్, రాజమౌళి రావడానికి కారణం ఏంటంటే..?

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కీలకపాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సందీప్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం పట్టేలా ఉంది. తండ్రి, కొడుకులు మధ్యన శృతించిన ప్రేమను తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే అంశాన్ని.. ఈ సినిమాలో చూపించబోతున్నారట. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ముందుకి రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ సాగుతున్నాయి. బాలీవుడ్ తరువాత పెద్ద మార్కెట్ టాలీవుడ్ కావడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా ఎక్కువగా ప్రమోషన్స్ జరుగుతున్నారు.

ఇప్పటికే బాలయ్య అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో సందడి చేశారు ఈ మూవీ టీం. ఇక ఈరోజు ఈ సినిమాకు సంబంధించి రెండు ప్రమోషన్ ఈవెంట్లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం మీడియాతో రణ్‌బీర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగతోపాటు.. సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇంటరాక్ట్‌ కాబోతున్నారు. దీని తర్వాత ఈవ్‌నింగ్ మరో ప్రమోషనల్ ఈవెంట్ జరగబోతోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ప్రీ రిలీజ్ ఇవెంట్ ప్లాన్ చేసారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు వీరిద్దరూ రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర మూవీ తెలుగులో రిలీజ్ కావడానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించాడు.

ఆ సమయంలో ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా రాజమౌళి హాజరయ్యాడు. అప్పట్లో వీరిద్దరి మధ్యన పరిచయం ఇప్పటికి కంటిన్యూ అవ్వడం.. ఆ చనువుతోనే రాజమౌళిని.. యానిమ‌ల్‌ మూవీ టీం ఆహ్వానించారని.. దీని కోసం రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదే విధంగా మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ బాండింగ్‌తోనే మహేష్ బాబును కూడా గెస్ట్ గా పిలిచారట డైరెక్టర్. మహేష్ బాబు కూడా ఈ ప్రమోషన్ ఈవెంట్లో హాజరు కాబోతున్నాడట. ఇక రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెకబోతున్న సంగతి తెలిసిందే. యానిమల్ ఈవెంట్లో వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో.. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై కూడా ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.