భారీ డిజాస్టర్ దిశగా ఆదికేశవ మూవీ.. అన్ని కోట్లు నష్టం తప్పదా..!!

మెగా హీరో వైష్ణవ తేజ్, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆదికేశవ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. నిర్మాత నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఇందులో లవ్ ,రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.. వైష్ణవి తేజ్ కెరియర్ లోనే మొట్టమొదటి మాస్ ఇమేజ్ సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆదికేశవ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకుందాం.

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ని మూటకట్టుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పెద్దగా ఆశాజనకంగా లేనట్లు తెలుస్తోంది.మూడు రోజుల కలెక్షన్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో..1.3 కోట్ల రూపాయలను రాబట్టగా..2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు గాని 1.6 కోట్లు రాబట్టగా.. మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆదికేశవ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..8.5 కోట్ల రూపాయలు జరగక బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా 9 కోట్ల రూపాయల టార్గెట్ తో దిగడం జరిగింది.. ఇప్పటివరకు కనీసం 2
కోట్లు కూడా రాబట్ట లేకపోతున్న ఆదికేశవ సినిమా ఖచ్చితంగా 6 కోట్ల రూపాయల డిజాస్టర్ తో ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. వైష్ణవ తేజ్ కెరియర్ లో ఉప్పెన సినిమా తప్ప మరో సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం హ్యాట్రిక్ ప్లాపులతో మునిగిపోతున్నారు. శ్రీ లీలకు కూడా ఈ సినిమా గట్టి దెబ్బ పడింది అని చెప్పవచ్చు.