తమన్నాతో పెళ్లిపై విజయ వర్మ షాకింగ్ కామెంట్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా.. మిల్కీ బ్యూటీగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటి బాలీవుడ్ హీరో విజయవర్మ ఇద్దరు.. ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్‌ స్టోరీస్ 2 సినిమాలో నటించి మెప్పించారు. ఈ సిరీస్ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి సినిమా షో లలో ఈవెంట్లలో పాల్గొని సందడి చేసేవారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని ఒక స్టేజిపై ప్రకటించిన ఈ జంట పెళ్లి విషయంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయవర్మ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు.

కానీ తమన్న పరిచయమైన తర్వాత నటన, ఆలోచన, లాజిస్టిక్, ఫైనాన్స్, సినీ పరిశ్రమల విషయాలు అవగాహన ఉన్న వ్యక్తి చాలా ముఖ్యమని.. తెలుసుకున్న.. తమన్న మంచి యాక్టర్స్ ఏ కాకుండా చాలా తెలివైన అమ్మాయి.. నా సినిమా ప్రయాణంలో నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమన్నా మాట్లాడుతూ నా కోయాక్టర్‌తోనే ప్రేమలో పడతానని ఎప్పుడు ఊహించలేదు.. తను ఏమాత్రం మారకుండా నన్ను యాక్సెప్ట్ చేశాను అంటూ సంతోషం వ్యక్తం చేస్తాడు.. విజ‌య్ నా హ్యాపీ ప్లేస్ తను అంటూ గర్వంగా చెప్పింది. ఇక తాజాగా విజయవర్మ, తమన్నాతో ప్రేమ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఇటీవల విజయవర్మ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. దీనికి విజయ్ వర్మ మాట్లాడుతూ ఈ ప్రశ్నకు నేను మా అమ్మకు కూడా ఆన్సర్ చేయలేను.. కాబట్టి మీకు కూడా సమాధానం చెప్పలేను.. అంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా.. అది ఓ బాధ్యత.. పార్టీ కాదు.. ఎంతో ఆలోచించాలి.. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అంటూ వివరించాడు. దీంతో విజయ్‌ మాటలపై ట్రాన్స్లేట్ డౌట్లు మొదలయ్యాయి. అసలు తమన్నా, విజయ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.