‘ ఆదికేశవ ‘ మూవీని ఆ మెగా హీరో రిజెక్ట్ చేశాడా.. కారణం ఏంటంటే..?

వైష్ణవ్ తేజ్‌, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజై యావరేజ్ టాక్ ను దక్కించుకుంది. కమర్షియల్ యాక్షన్ జాన‌ర్‌లో రొటీన్ ఫార్మాట్లో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో వైష్ణవ తేజ్ నటనలో మరింత స్కోప్ ఉండి ఉంటే బాగుండేదంటూ.. భారీ యాక్షన్స్ సీన్స్‌తో కూడిన కథ కావడంతో వైష్ణవకు అంతగా సెట్ కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి.

ఇలా ఉంటే ఆదికేశవ సినిమాకు మొదట వైష్ణవ తేజ్‌ను కాకుండా మరో మెగా హీరోను అనుకున్నారట. ఇంత‌కి ఆ హీరో ఎవ‌రు.. ఆ సినిమా వైష్ణ‌వ్ తేజ్ వ‌ద్ద‌కి ఎలా వ‌చ్చింది తెలుసుకుందాం.. మొద‌ట మెగాహీరో వరుణ్ తేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాశాడ‌ట‌ డైరెక్టర్ శ్రీకాంత్. కొన్ని కారణాలతో కథను వరుణ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లి సెట్ కావడం, మధ్యలో వేరే సినిమాలు బిజీగా ఉండడం.. కథపై చిన్న అనుమానం కూడా ఉండడంతోనే కథ నుంచి సైడ్ అయ్యారని టాక్ వినిపించింది.

దీంతో ఈ కథ చాలామంది హీరోస్ వద్దకు వెళ్లగా ఫైనల్ గా వైష్ణవ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందులోను ఈ సినిమాని బడా ప్రొడ్యూసర్ నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య లాంటి పెద్ద బ్యానర్‌లు నిర్మించడంతో వైష్ణవ్‌ కథకు ఒప్పేసుకున్నాడని తెలుస్తుంది. మ‌ళ‌యాళ స్టార్ యాక్ట‌ర్ జోజు జార్జ్ ఈ మూవీలో విల‌న్ రోల్ ప్లే చేశాడు.