తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొదట ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడడంతో అప్పటినుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని చిత్రాలు సౌత్ లో కంటే నార్త్ లోనే మరింత ఇంపాక్ట్ చూపించాయని చెప్పవచ్చు. అందుకే మన దర్శక నిర్మాతలు ఒక చిత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు.
అయితే సినిమా కలెక్షన్లు సైతం పెరగడంతో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కూడా అమౌంట్ పెంచేశారు దీంతో కొంతమంది నిర్మాతలు సైతం కాస్త ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కొక్కరు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ గా పేరుపొందిన ఈ నటుడు జైలర్ సినిమాకి 200 కోట్లు తీసుకున్నట్లు గతంలో వార్తలయితే వినిపించాయి. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమాకి రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా పుష్ప మొదటి భాగానికి అల్లు అర్జున్ జాతి అవార్డు కూడా అందుకోవడం జరిగింది. పుష్ప సినిమాకి 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప-2 కు ఎంత తీసుకుంటారో అటు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కంటే బిజినెస్ లో 30% తనుకు వచ్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.. ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ 1000 కోట్ల వరకు వేస్తున్నారు సినీ ప్రేక్షకులు.. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల వరకు తన రెమ్యూనరేషన్ వెళ్తుందని చెప్పవచ్చు.