పాయల్ రాజ్ పుత్ పైన అన్ని కోట్ల బడ్జెట్.. వెనక్కి తెచ్చేనా..?

Rx -100 సినిమా ద్వారా తన నటనతో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత పాయల్ ఎన్ని సినిమాలలో నటించిన తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది తప్ప తనకు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు.. మళ్లీ డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లోని మంగళవారం అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా నవంబర్ 17వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ హైట్ క్రియేట్ అవుతోంది. సౌత్ ఇండియాలోనే అన్ని భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. సస్పెన్స్ హర్రర్ త్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడంతో పాటు పాయల్ మరొకసారి బోల్డ్ సన్నివేశాలు మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్లో పాల్గొంటూనే ఉంది .

ఈ సినిమా మొత్తం బడ్జెట్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు దాదాపుగా ఈ సినిమాకి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్క హీరోయిన్ మీద నమ్మకంతోనే డైరెక్టర్ అజయ్ భూపతి ఇంతటి రిస్క్ చేస్తున్నారా అంటూ పలువురు నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి RX -100 కాంబో రిపీట్ చేస్తున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఈ సినిమాతో పాయల్ గట్టేక్కుతుందో చూడాలి.