మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే అని చెప్పవచ్చు.

చాలామంది మొబైల్ కి ఏదో మెసేజ్ వచ్చిన ఫోన్ వచ్చిన పట్టుకొని తిరుగుతూ రిప్లై ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తదితర వాటిని చూస్తూ అలాగే ఉంటారు. అయితే ఇలాంటివి చూడడం వల్ల వేలు నొప్పిగా ఉండకపోయినా స్క్రీన్ పై చూసేందుకు మెడ ఉంచినప్పుడు కచ్చితంగా అలాగే ఉంటే మెడ నొప్పి వస్తుందని టెక్నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మెడ వీపు చేతులపైన చాలా ఒత్తిడి పడుతుందట.మొబైల్ కిందికి చూడడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అది మెడ పైన చాలా ఒత్తిడిని సైతం ఉంచి అసౌకర్యాన్ని కలిగిస్తుందట.

మారుతున్న కాలంతో పాటు ఇది కూడా ఒక సాధారణ సమస్యగా మారుతోంది.సుమారుగా సగానికి పైగా వ్యక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. అయితే రాబోయే రోజులలో ఈ నొప్పి శరీరమంతటా కూడా ప్రభావాన్ని చూపుతుంది. దీని నుంచి విజ్ఞప్తి పొందాలి అంటే మెడను స్ట్రైట్ గా చేసే పద్ధతి మాత్రమే ఉంటుందట.. మెడను ఎక్కువగా కిందికి వంచి చూడకుండా ఉండాలట. మొబైల్ కంటే డిస్క్ టాప్ ని వాడటం వల్ల తలవంచకుండా ఉండవచ్చు.