యానిమల్ సినిమాని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ పలు రకాల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవలే బాలీవుడ్లో రష్మిక నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది.డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి విడుదలైన పాటలు , రొమాంటిక్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమా ట్రైలర్ తో మతి పోగొట్టారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇందులో రణబీర్ అద్భుతమైన నటనత అదరగొట్టేసారని కనిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక ఆశలన్నీ కూడా యానిమల్ సినిమా పైన పెట్టుకుంది. అయితే ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చిత్ర బృందం తాజాగా ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతున్నది.

వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్గా పరిణితి చోప్రా నటించాల్సి ఉండేదట. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాను వదులుకుందట. గతంలో ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణితి ఈ విషయాన్ని సైతం తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ తన తదుపరి ప్రాజెక్టులలో నటించడంతో ఈమె డేట్లు అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలియజేసింది. అయితే ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే ఈ పాత్రను మిస్ చేసుకున్నందుకు పరిణిత అన్ లక్కీ హీరోయిన్ అని చెప్పవచ్చు.