రివ్యూ:అద్భుతమైన రెస్పాన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న కోటబొమ్మాలి మూవీ.. సెలబ్రేటిల ట్వీట్స్ వైరల్..!!.

ఇప్పుడు ఎక్కడ చూసినా లింగి లింగి లింగిడి అనే సాంగ్ బాగా పాపులారిటీ అందుకుంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పాట కోటబొమ్మాలి అనే సినిమాలోని పాట.. ఈ ఒక్క పాట మాత్రమే మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఈ రోజున ఈ కోటబొమ్మాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఏ విధంగా అభిమానులను మెప్పించింది చూడాలి మరి.

హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ,శివాని రాజశేఖర్ తదితరులు సైతం ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. మొదట ఈ సినిమాని చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో రివ్యూ ఇవ్వడం జరిగింది.. ఇందులో ప్రతి ఒక్కరి నటన హైలైట్ గా ఉందని శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉంటున్నాయని ఎమోషనల్ పార్ట్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికే కూడా గూస్ బమ్స్ రావడం ఖాయమని తెలియజేశారు. ఇందులోని డైలాగులు రాయడం చూపించడం నిజంగా అభినందిస్తున్న విషయమే అంటూ తెలిపారు. ఈ సినిమా ఈ వీక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటూ తెలియజేస్తున్నారు.

అలాగే హీరో నిఖిల్ కూడా స్పందిస్తూ ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని తెలియజేశారు.

మరి కొంతమంది ఆడియన్స్ ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడి వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమా కూడా మెమోరబుల్ పర్ఫామెన్స్ ఉన్నాయని తెలుపుతున్నారు. ఏదిఏమైనా కోటబొమ్మాలి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.