యానిమల్ ట్రైలర్ కు రెబల్ స్టార్ రివ్యూ.. ఏమన్నాడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్, సెకండ్ సింగిల్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఏదైనా సినిమా ట్రైలర్ గాని, కంటెంట్ గాని ఉందనిపిస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ యానిమల్ ట్రైలర్ చూసిన ప్రభాస్ ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు.

వాట్ ఏ ట్రైలర్.. వాట్ ఏ ఫీల్.. ఎక్స్ట్రార్డినరీ.. మెంటల్.. కంగ్రాట్యులేషన్స్ ఐ యాం వెయిటింగ్ ఫర్ థిస్ మూవీ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు. ఇక డిసెంబర్ 1న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. రన్బీర్ కపూర్ మూవీలో ఇంటెన్సివ్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమాని భూషణ్ కుమార్, టి సిరీస్, భద్రకాళి పిక్చర్, సినీ 1 బ్యానర్స్ వారు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ కపూర్, బాబి డియాలో కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.