రామ్ చరణ్ కు కూడా తప్పని లీకుల బెడద.. గేమ్ ఛేంజర్ సెట్ నుంచి వీడియో లీక్..!!

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది.. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్లో ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, పాటలు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్, అంజలి , సునీల్ వంటి వారు కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి డైరెక్టర్ శంకర్ భారతీయుడు-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి పనుల కోసం రామ్ చరణ్ కొద్ది రోజులపాటు బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు నిన్న ప్రైవేట్ జట్టులో మైసూర్ కి చేరుకున్న రామ్ చరణ్ అందుకు సంబంధించి అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు కొన్ని వీడియో కూడా లీకులు అవ్వడం జరిగింది.

రామ్ చరణ్ ఇందులో సూటుబోటు వేసుకొని క్లీవ్ సేవతో జెంటిల్మాన్ గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం. ఒకటి రాజకీయ నాయకుడిగా మరొకరు ఐఏఎస్ పాత్రలో అని తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఈ లీక్ అయిన వీడియో చూస్తూ ఉంటే రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఎన్నో సార్లు గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.