బడా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న కమెడియన్ కూతురు..!!

టాలీవుడ్ లో కమెడియన్స్ కు సైతం ఒక్కో స్లాగ్ ఉంటుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు పృథ్వీరాజ్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన నా కమెడియన్ పృథ్వి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాలు తగ్గించుకునేలా చేశారు కానీ రాజకీయాలలో ఎదురు దెబ్బలు తగలడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటించడానికి పలు అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నారు.

అలా అవకాశాలు వచ్చిన వాటిని చేజారకుండా పలు నటిస్తూ ఉన్నారు పృథ్వీరాజ్.. తాజాగా తన కుమార్తె శ్రిలు ను హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తానే దర్శకత్వం వహిస్తూ ఉన్నారు పృథ్వీరాజ్. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కూతురుతో కలిసి పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్రీలు పెళ్లి ప్రస్తావనతో పాటు పలు విషయాలను ఇందులో తెలియజేశారు.

గత కొంతకాలంగా ఇమే ఒకరితో ప్రేమలో ఉందని అంటూ వార్తలు వైరల్ గా మారుతున్న నేపథ్యంలో మీరు ఒక స్టార్ ఇంటికి కోడలు కాబోతున్నారా అంటూ శ్రీలు ను ప్రశ్నించగా అందుకు ఆమె సిగ్గుపడుతూ ఉండడంతో పృథ్విరాజ్ సైతం తమ ప్రేమ వ్యవహారాల గురించి పలు విషయాలను చర్చించారు అయితే ఇమే ఎవరిని చేసుకోబోతోంది ఏ ఇంటికి కోడలుగా వెళ్లబోతోంది అనే విషయాలను పూర్తిగా మ్యూట్ చేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా టెలికాస్ట్ కావాల్సి ఉంటుంది.