మునగ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మునగ కూరను మునక్కాయలను ఎక్కువగా తినడానికి సైతం ఇష్టపడుతూ ఉంటారు.. మునక్కాయ ఆకులలో పువ్వులలో కూడా చాలా రకాల ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.. మునక్కాయలను మన ప్రాంతాలలో మొరింగా అని కూడా పిలుస్తూ ఉంటారు. మునక్కాయల సాంబార్ ఫ్రై ఇతరత్రా వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

ముఖ్యంగా బీపీ షుగర్ తగ్గించడంలో మునగ చాలా సహాయపడుతుంది. వాస్తవానికి ఉసిరికాయలను రెగ్యులర్ గా తినడం వల్ల కూడా బీపీ షుగర్ తగ్గుతుందనేది ఎంతవరకు నిజమో అలాగే మునగలో ఉండే పోషకాలు బిపిని తగ్గించడానికి సహాయపడతాయట. మునగలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తప్రసరణ చాలా సులువుగా జరుగుతుంది. మునగలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్స్ ఫైబర్ కనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ లక్షణాలు మాత్రమే మధుమేహ వ్యాధి గ్రహస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది.

మునగలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎముకలను బలోపేతంగా చేయడానికి రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్యాన్సర్ బారి నుండి తప్పించేలా చేస్తాయి. ఏదైనా ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడేవారు మునగ ఆకు తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.మునగ ఆకు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మొటిమలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇవే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మునగకాయలను అధికంగా తినడం వల్ల మగవాళ్ళ వీర్యకణాలు పెరుగుతుందట.