చలిలో వాకింగ్ కి వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…!!

ప్రతి ఒక్కరు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. శీతాకాలంలో సైతం వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొగ మంచు ఉంటుంది కాబట్టి రోడ్డు మీద కాకుండా మైదానంలో వాకింగ్ చేయడం మంచిది.

వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత చల్లటి నీరు తాగితే హార్ట్ ‌స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. వాకింగ్ అనంతరం గోరువెచ్చని నీరు తాగడం మంచిది. చలికాలంలో వాకింగ్ చేసేవారు వేడి సామతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం.

అంతేకాకుండా వాకింగ్ చేసే వాళ్లకు త్వరగా ఆయాసం వస్తూ ఉంటుంది. అందువల్ల స్లోగా నడవడం బెటర్. ఆస్తమా ఉన్నవారు చలికాలంలో వాకింగ్ చేయకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలను పాటించి ఈ చలికాలంలో వాకింగ్ కి వెళ్ళండి.