ఎన్టీఆర్ చేసిన సినిమాలల్లో మహేశ్ కి నచ్చిన బెస్ట్ మూవీ ఇదే.. ఏకంగా 100 సార్లు చూశాడట..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన మంచితనం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వమే . సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . మనిషికి తగ్గట్టు మాట మార్చే హీరోలే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ . అయితే ఎన్టీఆర్ అంటే ఏ ఇండస్ట్రీ హీరోలకి అయినా ఎలాంటి హీరోలైన ఒకే విధంగా చూస్తాడు .

టాలెంట్ ని ఎక్కువగా నమ్ముతాడు . అందుకే ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకు ఎన్టీఆర్ అంటే చాలా చాలా . ఇష్టం వీళ్ళిద్దరూ సినిమాలో హీరో పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండ్స్ . బయటకు మాత్రం కనిపించరు . గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ మహేష్ ను ఓ ప్రశ్న వేస్తాడు .

ఎన్టీఆర్ సినిమాల్లో ఆయనకు బాగా నటిచిన నచ్చిన సినిమా ఏంటి..? అంటూ ప్రశ్నిస్తాడు . దీనికి మహేష్ బాబు “ఆది” అంటూ ఆన్సర్ ఇస్తాడు . “ఆ సినిమాలో నిన్ను తప్పిస్తే వేరే ఏ హీరోని ఊహించుకోలేమని ..ఆ సినిమా నేను వందసార్లకు పైగానే చూశాను “అంటూ చెప్పుకొస్తాడు . ప్రజెంట్ అదే కామెంట్స్ ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు..!!