పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఏమిటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు తాను సినిమాలలో నటించానని కరాకండిగా చెప్పారు.. కానీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతూనే ఉన్నారు. ఇక పార్టీ ఫండింగ్ కోసం సినిమాలు చేస్తున్నానంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఈసారి సినిమాలు ఎంచుకొనే విధానంలో సైతం పలుమార్పులు చేశారు.

అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమ్లా నాయక్.. బ్రో అంటే సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు కూడా రీమిక్స్ సినిమాలే.. ఈ మూడు సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, OG వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే పార్టీ నడపడానికి నిర్మాతలు దగ్గర నుంచి ముందే డబ్బులు తీసుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్లో కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా దాదాపుగా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండేళ్లు పైనే కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు.. ఉస్తాధ్ భగత్ సింగ్ కేవలం 20 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి అయింది. OG సినిమా సగం వరకు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే ఎలక్షన్స్ వస్తూ ఉండడంతో ఈ సినిమాలన్నిటిని నిలిపేశారని తెలుస్తోంది. టోటల్గా తన ఫోకస్ మొత్తం పొలిటికల్ వైపునే పవన్ కళ్యాణ్ పెట్టడంతో అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఎన్నికలలో ఎలాంటి పోటీ ఇస్తారో చూడాలి.