ఎంగేజ్మెంట్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లి వేడుకలు చాలానే జరుగుతూ ఉన్నాయి. వెండితెర బుల్లితెర పైన సంబంధం లేకుండా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో కామెడీ షో గా పేరుపొందిన జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పవిత్ర కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని తన ఇంస్టాగ్రామ్ నుంచి పలు ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

అంతేకాకుండా జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ ను బాగా ఉపయోగించుకున్న పవిత్ర పలు చిత్రాలలో టీవీ షోలలో కూడా అలరిస్తూ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆడియన్స్ ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈమె యూట్యూబర్ సంతోష్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. ఇప్పుడు పెళ్లికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. అయితే గడిచిన ఐదు నెలల క్రితం ఒక ఫ్రాంక్ పెళ్లి వీడియోని చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడం జరిగింది.. కానీ ఈసారి మాత్రం నిజంగానే ఆ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా సంతోష్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది పవిత్ర.. తన పెళ్లి వార్తని ఈ విధంగా తెలియజేయడం కోసం .. ఈ క్షణం కోసం సంతోష్ ఒక ఏడాది నుంచి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారని పవిత్ర తెలియజేయడం జరిగింది .ప్రస్తుతం అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయగా అభిమానుల సైతం ఈ జంటకి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. మరి తన పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు పవిత్ర.