లక్ష్మి ప్రణతి కి ఆ హీరో అంటే అంత ఇష్టమా… అందుకే ఇప్పటికీ అలా చేస్తుందా….!!

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన నటనతో ఎప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా మనందరికీ సుపరిచితమే. సాధారణంగా మన కుటుంబంలో ఓ హీరో ఉంటే ఆ హీరోనే మనం ఇష్టపడుతూ ఉంటాము.

ఈ క్రమంలోనే లక్ష్మి ప్రణతి సైతం తన భర్త జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే చూస్తుందని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఈమెకి ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్ అట. ఈమెకి సినిమాలపై అంత ఆసక్తి లేకపోవడం వల్ల సినిమాలు సైతం చూడదట. ఎప్పుడైనా సినిమాలు చూడాలనిపిస్తే కేవలం సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే చూస్తుందట. అనంతరం ఇంకా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తుందట లక్ష్మి ప్రణతి.

ప్రస్తుతం ఈమె తన పిల్లలతో బిజీ అయిపోయింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరిని చూసుకుంటూ డైలీ లైఫ్ లో బిజీ అయిపోయింది లక్ష్మీ ప్రణతి. అందువల్ల ఈ మధ్యన ఈమె పెద్దగా సినిమాలు చూడడం లేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.