చిరంజీవి నటించిన అన్ని సినిమాలలో.. బాలయ్య కి ఆ ఒకే ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట…!!

టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య మొదటి స్థానంలో ఉంటారు. ఇద్దరూ తమ టాలెంట్తో ఎంతోమంది అభిమానులని దక్కించుకున్నారు. బాలయ్య పేరు ఎత్తితే.. ఊర మాస్ డైలాగ్ యాక్షన్ సీన్లు గుర్తుకు వస్తాయి. అలాగే చిరు పేరు ఎత్తితే డాన్సులు మేనరిజం గుర్తుకు వస్తుంది. అలాగే వీరిద్దరి కెరీర్ లో ఎన్నో గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇక చిరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు.

అలాగే బాలయ్య సైతం ఎన్టీఆర్ క్రేజ్ ని వాడుకుని పైకి రాకుండా.. తన ఓన్ టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదిగాడు. అలాగే చిరు నటించిన సినిమా లిస్ట్ చూసుకుంటే.. చాలా పెద్దగానే ఉంటుంది. చిరు నటించిన అన్ని సినిమాలలో కంటే బాలయ్యకు ఆ ఒకే ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమా ఏంటంటే.. చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ” జగదేకవీరుడు అతిలోకసుందరి “. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. ఈ మూవీకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సోషియో ఫాంటసీ సినిమాకి జంధ్యాల కథను రాశారు. అంతేకాకుండా ఈ మూవీకి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఈ సినిమాలోని ” అమ్మని కమ్మని దెబ్బ ” పాట అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా నందమూరి నటసింహం బాలయ్య ఆదరణ సైతం పొందింది. దీనిబట్టి చూసుకుంటే ఈ సినిమా ఎంత బాగుంటుందో ఈతరం వాళ్లకి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.