Review: జపాన్ మూవీ రివ్యూ.. కార్తీక్ వన్ మ్యాన్ షో..!!

కోలీవుడ్ లో కూడా ఎప్పుడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు హీరో సూర్య తన తమ్ముడు కార్తీ.. ఇటీవలే కార్తీ నటించిన చిత్రం జపాన్.. తెలుగులో మాత్రం పెద్దగా హైప్ ఏర్పడకపోయినా కోలీవుడ్ లో మాత్రం భారీగానే హైపర్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన జపాన్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కార్తీ 25వ చిత్రంగా జపాన్ సినిమాని తెరకెక్కించారు.. డైరెక్టర్ రాజు మురగ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దీపావళి కానుకగా ఈ రోజున విడుదల కాక ఇప్పటికే పలుచోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడి అభిమానులను మెప్పించినట్లుగా తెలుస్తోంది.సోషల్ మీడియాలో పలువురు ప్రేక్షకులు తమ అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది.

జపాన్ సినిమా కు మిక్స్డ్ టాకు ఏర్పడుతోంది. ఈ సినిమాలో కార్తీ దొంగగా అద్భుతంగా నటించారని కొంతమంది చెబుతూ ఉండగా మరికొంతమంది ఫస్ట్ ఆఫ్ బోరింగ్ గా ఉందని సెకండాఫ్ త్రిల్లింగ్ తో మెప్పించిందని కామెంట్స్ చేస్తున్నారు.

మరో నెటిజన్ మాత్రం జపాన్ సినిమా వన్ మ్యాన్ షో అని కార్తీక్ అద్భుతంగా నటించారని ఇందులో కామెడీ సన్నివేశాలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా మారుతున్నాయని తెలుపుతున్నారు. హీరోయిన్ అను ఇమ్మానియేల్ గ్లామర్ కూడా ఈ సినిమాకి కాస్త ప్లస్ అయిందని కూడా తెలియజేస్తున్నారు. ఎమోషనల్ తో సాగేటువంటి సన్నివేశాలను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉందని సినిమాటోగ్రఫీ కూడా అదరగొట్టేసారని ట్వీట్ చేస్తున్నారు.