బర్త్డే రోజు అమర్ కోసం భార్య ఎంట్రీ .. ప్రశాంత్‌తో మా ఆయన చిన్న పిల్లాడు ఏమనుకోవద్దు అంటూ..

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ వీక్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం సీజన్స్ అన్ని ఎమోషనల్ నేపథ్యంలో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ లో నిన్న అమర్‌దీప్‌ పుట్టినరోజు సందర్భంగా అమర్ భార్య తేజస్విని.. హౌస్ లోకి అడుగు పెట్టింది. కాగా మొదట అమర్ దీప్ బిగ్ బాస్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఈరోజు మీ పుట్టిన రోజు కదా మీ భార్య కేక్ పంపించారు. ఆవిడ రాలేకపోయారు అంటూ చెప్పింది. కనీసం తను రాకపోయినా కేక్ అయినా పంపించిందిలే అనుకుంటూ అమర్ బయటకు వచ్చాడు.

చూస్తే తేజస్విని ఎదురుగా ఉంది దీంతో అమర్దీప్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఇక వారిద్దరినీ కాసేపు ఫ్రీగా వదిలేయండి అంటూ శివాజీ హౌస్ మేట్స్ అందరిని బయటకు తీసుకెళ్లాడు. వారిద్దరూ కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుని తర్వాత తేజస్విని వారిద్దరి ఎంగేజ్మెంట్ రింగ్ బిగ్‌బాస్ హౌస్‌కి బ‌చ్చేముందు ఇంట్లోనే మర్చిపోయాడని దాన్ని ఓ సినిమాటిక్ స్టైల్లో అమర్దీప్ కి తొడిగింది. తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ హౌస్ మేట్స్‌తో బర్త్డే సెలబ్రేట్ చేశారు. తేజస్వినికి కేక్ తినిపించగా ఆమె అమర్ ని రొమాంటిక్ గా కిస్ చేసింది. అమర్ తేజస్విని ఎత్తుకొని ఎన్నో రొమాంటిక్ డ్యాన్స్ చేశాడు.

ఇక తేజస్విని హౌస్ లో నుంచి వెళ్లే కాసేపటి ముందు పల్లవి ప్రశాంత్ ఆమె వద్దకు వచ్చి అన్నతో గొడవ పడుతున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు అని కోరాడు. అలాంటిదేమీ లేదు మీరంతా బాగానే ఉన్నారు కదా బాగా ఆడండి అంటూ తేజస్విని వివరించింది.. మా ఆయన కాస్త చిన్నపిల్లాడి లాంటోడు మీరు కూడా మనసులో పెట్టుకోకండి అంటూ తేజు వివ‌రించింది. తేజస్విని వెళ్ళాక శోభాశెట్టి తల్లి, యావ‌ర్ సోదరుడు హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరి మధ్యన కూడా ఎమోషనల్ సన్నివేశాలు కొనసాగాయి.