రతికకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మాజీ లవర్ రాహుల్.. హౌస్ లో వాళ్ల గురించి ఏమన్నాడంటే..?!

రతిక రోజ్‌ బిగ్‌బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అందరి చూపు త‌న వైపు తెప్పుకుంది. ఏ విషయమైనా సూటిగా ధైర్యంగా మాట్లాడే ఈ అమ్మాయి తన క్యూట్ లుక్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. అలానే హౌస్లో యాక్టివ్ గా ఉంటూ టాస్క్‌, గేమ్‌ల‌లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంటూనే ఆపై గొడవలకు దిగడంతో చాలామందికి ఆమె బిహేవియర్ నచ్చలేదు. పైగా అందరి ముందు ప్రశాంత్‌ను చులకన చేసి మాట్లాడడంతో ప్రిన్స్ యావర్‌తో కూడా ఇలాగే పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేయడంతో రతికకు తక్కువ ఓట్లు పడి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే అదృష్టంతో రతిక మళ్ళీ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ అవకాశాన్ని కూడా రతిక సరిగా యూజ్‌ చేసుకోవడం లేదంటూ టాక్ వినిపిస్తుంది.

త్వరలోనే మళ్లీ బయటకు వచ్చేస్తుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగ‌ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే తన మాజీ ప్రియుడు ఓ సింగర్ అంటూ రతిక హింట్ ఇచ్చింది. దీనితో వెంటనే రాహుల్ రతికల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై రాహుల్ స్పందించాడు. కావాలనే ఇలా నెట్టింట ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇక వీరిద్దరి బ్రేకప్ పై రతిక తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా చాలా కామెంట్లు చేశారు. తాజాగా రతిక ప్రేమ వ్యవహారం బ్రేకప్‌పై రాహుల్ స్పందించాడు. ఇటీవల ఓ ప్రోగ్రాం కు హాజరైన రాహుల్ ప్రతి ఒక్కరి జీవితంలో గతం, వర్తమానం రెండు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు.

భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు అంటూ వివరించాడు. ర‌తికతో పాటు హౌస్ మేట్స్‌ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన రాహుల్ బాగా ఆడి బిగ్ బాస్ ట్రోఫీతో బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ వివ‌రించాడు. విజేత ఎవరనేది ఎవరు ఇప్పుడే నిర్ణయించలేం ప్రస్తుతానికి నాకైతే బోలే షావలి హౌస్ లో మంచి ఎంటర్టైనర్ అనిపిస్తుంది. అలాగే శివాజీ ఇంట్లో పెద్దన్నలా ఉన్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ ఒకప్పుడు బిగ్ బాస్ షోను సగటు ప్రేక్షకుడిగా చూసాడు. ఇప్పుడు ఆడియన్స్ అతనిని చూసే రేంజ్ కు ఎదిగాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.