ఆ ఒక్క పని చేయకుండా ఉంటే సమంత-నాగచైతన్య విడాకులు తీసుకునే వారే కాదు..అంత విధి రాత..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ప్రేమించుకున్నన్ని నాళ్లు కూడా వీళ్ళు కాపురం చేసుకోలేకపోయారు.  వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునేశారు . విడాకులకు సంబంధించి ఇప్పటికీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అయితే తాజాగా సమంత బజార్ అనే మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన విషయాలను చెప్పుకొచ్చింది.  ఇదే క్రమంలో నా లైఫ్ లో పెళ్లి అనే దశ ముగిసిపోయింది అంటూ కూడా చెప్పుకొచ్చింది.  ఇలాంటి క్రమంలోనే సమంత ఫ్యాన్స్ లైఫ్ లో ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండేవారు అంటూ చెప్పుకొస్తున్నారు .

సమంతకి నాగచైతన్యకి ఇద్దరికీ తాము అనుకున్నదే జరగాలి అన్న పట్టుదల ఉంది . ఆ కారణంగానే వీళ్ళు విడాకులు తీసుకున్నారు అని.. ఒక్కరు  గొడవ పడినప్పుడు ఏ ఒక్కరు తగ్గి ఉన్నా కానీ ఇప్పుడు వీళ్ళ లైఫ్ చాలా బాగుండేది అని.. అసలు వీళ్ళు పెళ్లి తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉండాల్సింది అని చెప్పుకొస్తున్నారు. దీంతో సమంత నాగచైతన్య పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!