తప్పు చేస్తున్నవ్ బన్నీ..ఆ హీరోయిన్ తో స్నేహం కొంప ముంచేయబోతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బన్నీ తప్పు చేస్తున్నాడా ..? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ  రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం .  రీసెంట్గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు .

అప్పటినుంచి మరింత స్థాయిలో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది.  రీసెంట్ గా బన్నీ – పాయల్ రాజ్ పుత్  హీరోయిన్గా నటించిన మంగళవారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు.  దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది . అయితే ఇదే క్రమంలో బన్నీ ఫాన్స్ ఆయన పై ఫైర్ అవుతున్నారు .

అసలు ఇంత చిన్న సినిమాకి నువ్వు చీఫ్ గెస్ట్ గా రావడం ఏంటి బన్నీ..? అంటూ తప్పు పడుతున్నారు . అంతేకాదు  బన్నీ హీరోయిన్ రాజ్ పుత్ తో  ఫ్రెండ్షిప్ తగ్గించుకుంటే మంచిది అంటూ సలహా ఇస్తున్నారు.   దీంతో సోషల్ మీడియాలో బన్నీ – పాయల్ రాజ్ పుత్ కు దూరంగా ఉండటమే బెటర్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!