ఊహించినట్లుగానే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ సైతం ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ పైన 70 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.. గతంలో న్యూజిలాండ్ చేతులు ఎదురైన ఓటమికి బదులుగా ఇప్పుడు తీర్పు ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. భారత్ తరపున బౌలింగ్ వేసిన మహమ్మద్ షమీ 7 వికెట్లు తీయడం జరిగింది. ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ 50 వన్డే సెంచరీల సైతం సాధించిన సచిన్ టెండుల్కర్ రికార్డ్లను సైతం తిరగరాశారు. సాధించిన ఈ ఘాతపైన ప్రపంచ దిగ్గజ క్రీడా సంస్థలు కూడా ప్రశంసలు కురిపించాయి. మ్యాచ్ అనంతరం తన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీని సచిన్ టెండుల్కర్ ఆనందంతో కౌగిలించుకొని ప్రశంసలు కురిపించారు. కోహ్లీ స్టేడియంలోనే తన భార్య అనుష్క వైపు చూస్తూ గాల్లో ముద్దులు విసరడం జరిగింది.. ఆ తర్వాత అనుష్క శర్మ కోహ్లీ పైన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది..
ఇంస్టాగ్రామ్ వేదికగా దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ మీ ప్రేమతో పాటు విరాట్ కోహ్లీ ప్రేమను అందించినందుకు చాలా కృతజ్ఞతురాలని మనసులోనూ ఆటపైన నిజాయితీగా ఉండి నువ్వు భవిష్యత్తులో మరిన్ని వాటిని అధిరోహిస్తావు నువ్వు నిజంగా దేవుడు బిడ్డవు అంటూ అనుష్క షేర్ చేసిన పోస్టు వైరల్ గా మారుతోంది. న్యూజిలాండ్ లో జరిగిన సెమీస్లో 117 పరుగులు చేయడం జరిగింది.. గతంలో 2003లో సచిన్ 673 పరుగులు చేయగా ఆ రికార్డును సైతం కోహ్లీ 10 మ్యాచ్లలో 711 పరుగులు చేశాడు.. తన రికార్డులను తిరగరాశారు.
View this post on Instagram